ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు' - vizag latest updates

మహిళలను వేధించిన వారిపై కఠిన చర్యలు తప్పవని... విశాఖ నగర పోలీస్​ కమిషనర్​ రాజీవ్​ కుమార్​ మీనా హెచ్చరించారు. మహిళా మిత్ర సైబర్​ టీంను... బాలికలు, మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

'మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు'

By

Published : Nov 23, 2019, 7:21 PM IST

'మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు'

మహిళలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని... విశాఖ నగర పోలీస్​ కమిషనర్​ రాజీవ్​ కుమార్​ మీనా హెచ్చరించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళా మిత్ర సైబర్​ టీంను... బాలికలు, మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి... వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీఇచ్చారు.

పాఠశాలకు, కళాశాలలకు వెళ్లే బాలికల తల్లిదండ్రులు... వారి పిల్లలను ఎవరైనా వేధింపులకు గురిచేస్తున్నారన్న అనుమానం వస్తే... ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి... ఉన్నతాధికారులతో విచారణ జరిపి దోషులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details