విశాఖ పారిశ్రామిక ప్రాంతమైన అగనంపూడి(aganampudi) వద్ద జరిగిన మైనర్ బాలిక అనుమానాస్పద మృతి(suspiciious death) కేసును పోలీసులు ఛేదించారు. మృతికి కారణమైన నరేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి పోక్సో(pocso act)తో సహా పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఆ బాలికను లొంగదీసుకుని మూడు నెలలుగా అమెకు మాయమాటలు చెప్పిన అతను.. చివరకు అమ్మాయి మృతికి కారణమయ్యాడని పోలీసులు వివరించారు.
భయంతో దూకేసింది...
విజయనగరం జిల్లా కొత్తపేట సమీపంలోని గొల్లపేట(gollapeta) గ్రామానికి చెందిన నరేశ్(naresh)... ఉపాధి నిమిత్తం విశాఖలోని లంకెలపాలెంలో కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. శనివాడ గ్రామంలోని ఓ అపార్ట్మెంట్లో నరేశ్ నివాసం ఉంటున్నాడు. నరేశ్‌కు ఎదురుగా ఉన్న మరో అపార్ట్మెంట్లో ఉంటున్న బాలిక(girl)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నిందితుడు నరేశ్... బాలికకు అశ్లీల వీడియోలు చూపిస్తూ లోబరచుకున్నట్లు సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. నరేశ్ అనే యువకుడితో బాలికకు శారీరక సంబంధం ఉందని సీపీ తెలిపారు. ఘటన జరిగిన రాత్రి కూడా ఇద్దరు శారీరకంగా కలిశారని, ఈ విషయం తండ్రికి తెలిస్తే ఏం జరుగుతుందోననే భయంతో బాలిక టెర్రస్(terros) పై నుంచి దూకి ఆత్మహత్య(suicide) చేసుకుందని సీపీ వివరించారు.