ప్రశాంతమైన విశాఖ నగరంలో ఇప్పుడిప్పుడే కొన్ని నేరాలు సమస్యలను సృష్టిస్తున్నాయని సీపీ మనీష్‌కుమార్ సిన్హా అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారం సవాళ్లన్నింటినీ ఎదుర్కొంటామని చెప్పారు. యువశక్తితో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కొవిడ్ వల్ల సమీప కాలంలో కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించారు. ప్రజల సహకారంతో వాటికి పరిష్కరిస్తామని చెబుతున్న విశాఖ సీపీ ఎం.కె.సిన్హాతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
నగర ప్రశాంతతకు భంగం కలిగించేవారిని ఉపేక్షించం: విశాఖ సీపీ - విశాఖ సీపీ తాజా వార్తలు
విశాఖలో ఉన్న భూవివాదాలు, నేరాలు, ట్రాఫిక్ సమస్యలకు అడ్డుకట్ట వేస్తామని విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా అన్నారు. ప్రస్తుతం పట్టణంలో పెరుగుతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేపడతామని ఆయన అన్నారు. అంతేకాకుండా యువత సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుదారి పట్టకుండా తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నగర ప్రశాంతతకు ఎవరైనా భంగం కలిగించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించమని ఆయన తెలిపారు.
విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా