ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలన్- 2022కి విస్తృత ఏర్పాట్లు - విశాఖపట్నం

President Fleet at Vizag: విశాఖపట్నంలో జరగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలన్- 2022 కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున్ తెలిపారు. ఇవాళ నగరానికి రాష్ట్రపతి చేరుకుంటారని.. ఈ రివ్యూలో పలు రాష్ట్రాల గవర్నర్లతోపాటు, కేంద్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు.

review on president fleet
ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ

By

Published : Feb 20, 2022, 4:17 AM IST

President Fleet at Vizag: విశాఖలో జరగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలన్- 2022 కోసం విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ నగరానికి రాష్ట్రపతి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్ సైతం వస్తున్నందున తగిన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్​ చెప్పారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొంటారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా.. మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. గతంలో సీఎం పర్యటన సందర్భంగా ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందుల వంటివి మరోసారి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details