విశాఖలో కరోనా బారిన పడి మృతి చెందుతున్న సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో కాన్వెంట్ కూడలిలో ఉన్న కైలాసభూమి శ్మశానవాటికకు పెద్ద సంఖ్యలో మృతదేహాలు చేరుకుంటున్నాయి. ఆదివారం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన దాదాపు 10 నుంచి 15 వాహనాలు శ్మశానవాటికకు చేరుకున్నాయి. దీంతో అక్కడ కాస్త రద్దీ ఏర్పడింది. నగరం మొత్తంలో ఇదే పెద్ద శ్మశాన వాటిక కావడం వల్ల మృతదేహాలను ఇక్కడకు తీసుకువచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
కరోనా మృతదేహాలతో రద్దీగా మారిన విశాఖ శ్మశాన వాటిక - విశాఖపట్నం తాజా కరోనా వార్తలు
విశాఖ కాన్వెంట్ రోడ్డు పక్కన ఉన్న శ్మశానవాటికకు ఆదివారం భారీ సంఖ్య కరోనా మృతదేహాలు చేరుకున్నాయి. దీంతో అక్కడ రద్దీ ఏర్పడింది.
కాన్వెంట్ రోడ్డు వద్ద స్మశానవాటికలో రద్దీ