విశాఖ నగరంలోని ప్రాంతీయ నిఘా, అమలు సంస్థ అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న జి.స్వరూపరాణి వృత్తి పరమైన విధులతోపాటు రచనా వ్యాసంగాన్ని కూడా కొనసాగిస్తూ పలువురి ప్రశంసలందుకుంటున్నారు. పలు సంచలన కేసులకు సంబంధించిన అంశాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా విశ్లేషిస్తూ కథనాలు రాస్తున్నారు.
- కీలక కేసుల్లో దర్యాప్తు అంశాలపై కథనాలు
- కిడ్నీమార్పిడి శస్త్రచికిత్సలు, సరోగసీ పేరుతో జరుగుతున్న అక్రమాలను కళ్లకు కట్టేలా లోతైన విశ్లేషణ చేస్తూ కథనాలు రాశారు.
- తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి గ్రామానికి చెందిన స్వరూపారాణి డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఆసక్తి ఉన్న అంశాలపై వ్యాసాలు, రచనలు కొనసాగించేవారు. కళాశాల అంతర్గత మ్యాగజైన్లలో అవి ప్రచురితమయ్యేవి. ఆ ఉత్సాహంతో కథలు, కవితలు రాసేవారు. ఆ అలవాటే ఆమె ఉన్నతికి సోపానమయింది. చదవాలనే ఆసక్తి మెండుగా ఉండటంతో ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కాగలిగారు.
- కేసుల్లో విజయం సాధించడానికి దర్యాప్తు అధికారులు ఉపయోగించిన తెలివితేటల్ని, సమయస్ఫూర్తిని ప్రస్తావిస్తూ మిగిలిన పోలీసులు కూడా ఆ విధంగా ఆలోచిస్తే వచ్చే ప్రయోజనాల్ని వివరించేవారు.
పోలీసుశాఖలోకి వచ్చిన తరువాత...
పలు కేసులకు సంబంధించిన అంశాలపై రచనలు చేయడం ప్రారంభించారు. పోలీసుశాఖ ‘సురక్ష’ పేరుతో తీసుకువస్తున్న మ్యాగజైన్‌లో ఈ రచనలు ప్రచురితమయ్యేవి. నైనా సాహ్ని, జెస్సికాలాల్, సైనేడ్ మల్లిక తదితర సంచలన కేసుల్లో నిందితులకు శిక్షలు పడడానికి పోలీసులు చేసిన కృషిని ఆసక్తికర కథనాలుగా మలిచారు.
ద్రోహులెవరు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో...
● నార్కో ఎనాలసిస్, లైడిటెక్షన్ పరీక్షలు వివిధ కేసుల దర్యాప్తుల చిక్కుముళ్లు వీడడానికి ఏవిధంగా సహకరిస్తున్నాయన్న వివరాలతో కేసులను విశ్లేషిస్తూ కథనాలు రాశారు.
● అత్యాచారాలకు, యాసిడ్ దాడులకు గురైన కొందరు బాధితులు ఆయా సంఘటనలనే తలచుకుంటూ బాధపడకుండా.... మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించి అత్యుత్తమ విజయాల్ని సాధించి ఆదర్శప్రాయంగా నిలిచిన స్ఫూర్తిదాయక ఉదంతాలపై కథనాలు రాసి పలువురు ప్రశంసలందుకున్నారు.
అలా.. సంకలనం..