ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్కడా ఓ పక్షిరాజు.. నిత్యం ఆహారం అందిస్తున్నాడు! - vishakha latest updates

చుట్టూ సాగరనగర అందాలు. పచ్చటి కొండలు. తెల్లవారుజామున తనువును తాకే భానుడి నులివెచ్చని కిరణాలు. చలికాలంలో పరుచుకునే మంచు దుప్పటి. ఇంతటి ఆహ్లాదకర వాతావరణానికి రామచిలుకల సందడి తోడైతే..? మనకున్న చికాకులు, కోపాలు, ఒత్తిళ్లు అన్నీ మటాష్..! వందలాది చిలుకలకు సుమారు పదేళ్లుగా ఆతిథ్యమిస్తూ తన పరిసరాలను ఆహ్లాదంగా ఉంచుతున్నారు.... ఓ విశాఖ వాసి.

విశాఖలో ఓ పక్షిరాజు.. నిత్యం ఆహారం అందిస్తున్నాడు!
విశాఖలో ఓ పక్షిరాజు.. నిత్యం ఆహారం అందిస్తున్నాడు!

By

Published : Oct 26, 2021, 6:43 PM IST

విశాఖలో ఓ పక్షిరాజు.. నిత్యం ఆహారం అందిస్తున్నాడు!

కిటికీలో నుంచి బయటకు చూస్తే మేడలు. రోడ్డుపైకి వస్తే వాహనాల రణగొణధ్వనులు. మనకు మనమే ఏర్పరచుకున్న కాంక్రీట్ జంగిల్ పర్యవసానాలు ఇవి. జీవ వైవిధ్యంపై ఇది కొడుతున్న దెబ్బ మామూలుది కాదు. పక్షులు, ఇతర జీవరాశులను అక్కున చేర్చుకోవాలన్న మనసు ఉండాలే కానీ.. అవి ఇట్టే మనతో కలిసిపోతాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. విశాఖకు చెందిన లక్ష్మీనారాయణ. చిలకల్లో తన చిరు స్నేహితులను చూసుకుంటున్న ఈయన.. పదేళ్లకుపైగా వాటి ఆకలి తీరుస్తున్నారు.

విశాఖలోని కృష్ణా కళాశాల సమీపంలో నివసించే లక్ష్మీనారాయణ.. 2008లో తొలుత ఒకట్రెండు చిలుకలకు ఆహారమందించడం ప్రారంభించారు. చూస్తుండగానే వీటి సంఖ్య వందల్లోకి చేరుకుంది. రోజూ 3 సార్లు ఠంచనుగా వచ్చి మేడపై వాలిపోతుంటాయి.

చిలుకల సందడి వల్ల.. తమకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని కాలనీవాసులు అంటున్నారు. చిలుకలకు ఆహారం అందించడం ఏమాత్రం శ్రమ కాదని.. అవి రాకపోతే ఏదో వెలితిగా ఉన్నట్టు ఉంటుందని లక్ష్మీనారాయణ అంటున్నారు.

ఇదీ చదవండి:పొద్దునే లేస్తా.. చద్దన్నం తింటా.. సైకిలెక్కి పూలమ్ముతా..!

ABOUT THE AUTHOR

...view details