ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తరగతి మూడు.. చదరంగంలో మాత్రం చిచ్చరపిడుగు! - తరగతి మూడే..చదరంగంలో మాత్రం చిచ్చరపెడిగే!

ఎనిమిదేళ్ల చెస్ చిచ్చర పిడుగు మీనాక్షి.. మరో ఛాంపియన్ షిప్​ను గెలుచుకుని రికార్డు నెలకొల్పింది. ప్రపంచ కేడెట్ చెస్ ఛాంపియన్ షిప్​లో ప్రపంచంలో 15 మంది ఆటగాళ్లలో ఒకరిగా నిలిచింది. దిల్లీలో జరిగిన వెస్ట్రన్ అసియన్ జూనియర్ అండ్ యూత్ ఛెస్ ఛాంపియన్ షిప్ లో రెండు స్వర్ణ, ఒక కాంస్య పతకాలను గెలుచుకుని రాష్ట్రం తరఫున చెస్​లో కొత్త అశాకిరణంగా నిలుస్తోంది.

vishakapatnam kid create history in chess game

By

Published : Sep 20, 2019, 7:07 AM IST

తరగతి మూడే..చదరంగంలో మాత్రం చిచ్చరపెడిగే!

రాష్ట్రంలోని చిన్నారులు చెస్ క్రీడపై ఆసక్తి కనబరుస్తూ.. రాణిస్తుండటం ఒక పరంపరగా వస్తోంది. చిన్నతనం నుంచే చెస్​లో తర్ఫీదు పొందిన కొనేరు హంపి వంటి వారు ఆ రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఈనాటి తరం కూడా చెస్​లో తమ మేధస్సును చాటుతూ ఔరా అనిపిస్తున్నారు. విశాఖకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక కొలగట్ల అలన మీనాక్షి... చదరంగంలో చిచ్చర పిడుగులా దూసుకెళ్తోంది. మూడో తరగతి చదవుతున్న ఈ చిన్నారి... రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు గెలుస్తూ తన విజయప్రస్థానాన్ని పరుగులు పెట్టిస్తోంది.

ఆసియన్ స్కూల్ ఆఫ్ ఛాంపియన్​షిప్ లో నాలుగు పతకాలు

కామన్​వెల్త్ చెస్ చాంఫియన్​షిప్​ పోటీల్లో పాల్గొన్న మీనాక్షి... ఆరో స్థానంలో నిలించిది. గతేడాది శ్రీలంకలో నిర్వహించిన ఆసియన్ స్కూల్ ఆఫ్ ఛాంపియన్​షిప్​లో నాలుగు పతకాలను సాధించింది. ఒక బంగారు, ఒక వెండి, రెండు కాంస్య పతకాలను దక్కించుకొని రికార్డు నెలకొల్పింది. తాజాగా చైనాలో జరిగిన ప్రపంచ కేడెట్ చెస్ ఛాంపియన్​షిప్​లో భారత్​ తరఫున పాల్గొన్న 15 మంది క్రీడాకారుల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ నెల నాలుగు నుంచి 11 వరకు దిల్లీలో జరిగిన వెస్ట్రన్ ఆసియన్ జూనియర్ అండ్ యూత్ చెస్ ఛాంపియన్ షిప్ లో ఆమెను నాలుగు పతకాలు వరించాయి.

చిన్నతనంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న మీనాక్షి విజయాల పట్ల తల్లి అపర్ణతో పాటు ఇతర చెస్ క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతి చిన్న వయసులోనే అనేక ప్రపంచ రికార్డులును నెలకొల్పుతోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు చదరంగం, మరోవైపు చదరంగంలోనూ రాణిస్తున్న మీనాక్షి మరిన్ని విజయాలను తన ఖాతాలో వేసుకోవాలని చెస్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి :

ప్రసవ వేదనతో డోలీపై 5 కిలోమీటర్ల ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details