డిసెంబరు వచ్చిందంటే ప్రజలందరి చూపు విశాఖ ఉత్సవాలపైనే ఉంటుంది. వైభవంగా నిర్వహించే ఈ సంబరాలు ఈ ఏడాది నిర్వహించడం అనుమానంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఏటా ఉత్సవాలకు ముందుగానే తగు ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాదికి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు.
*కొవిడ్-19 నిబంధనలు, కరోనా మహమ్మారి ప్రమాదం పొంచి ఉండడంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ ఏడాది ఉత్సవాలకు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది నవంబరు 9, 10 తేదీల్లో రూ.50 లక్షలతో భీమిలి ఉత్సవాలు, రూ.2 కోట్లతో డిసెంబరు 28, 29న విశాఖ ఉత్సవ్, ఈ ఏడాది ఫిబ్రవరి 15,16న అరకు ఉత్సవాలను రూ.కోటితో నిర్వహించారు.
*గత రెండేళ్లుగా నవంబరులో భీమిలి ఉత్సవాలు నిర్వహిస్తుండగా మరో వారంలో ఈ నెల ముగియనుండడంతో ఈసారి నిర్వహించకపోవచ్ఛు విశాఖ ఉత్సవాల నిర్వహణపై మాత్రం సందిగ్ధత నెలకొంది.