విశాఖ జిల్లా కూర్మన్నపాలెంలో ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా భాజపా రాజ్యసభ్య సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు రెండు గంటలకు పైగా ఆందోళన చేపట్టారు. వారి నిరసనలతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
Protest: జీవీఎల్ వ్యాఖ్యలకు నిరసనగా ఉక్కు కార్మికుల ఆందోళన - జీవీఎల్ వ్యాఖ్యలకు నిరసనగా ఉక్కు కార్మికుల ఆందోళన వార్తలు
ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలకు నిరసనగా ఉక్కు కార్మికుల ఆందోళన చేపట్టారు. కూర్మన్నపాలెం కూడలిలో జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.
జీవీఎల్ వ్యాఖ్యలకు నిరసనగా ఉక్కు కార్మికుల ఆందోళన