ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై.. కార్మిక సంఘాల రాస్తారోకో

By

Published : Mar 8, 2021, 8:10 PM IST

Updated : Mar 8, 2021, 10:37 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై.. కార్మిక సంఘాల రాస్తారోకో
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై.. కార్మిక సంఘాల రాస్తారోకో

22:12 March 08

20:08 March 08

రోడ్డుపై ఆందోళన

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై.. కార్మిక సంఘాల రాస్తారోకో

విశాఖ కూర్మన్నపాలెంలో కార్మిక సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ కారణంగా కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచాయి. మూడు గంటలుగా జాతీయరహదారిని కార్మికులు దిగ్బంధించారు. జాతీయరహదారిపై 10 కి.మీ మేర రాకపోకలు నిలిచాయి. 

ఎమ్మెల్యే కన్నబాబు రాజును ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసుల సహాయంతో కన్నబాబు రాజు తన వాహనాన్ని అక్కడే వదిలేసి పోలీసు వాహనంలో వెళ్లారు. 

మంగళవారం ఉదయం 9 గంటలకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిపాలన కార్యాలయం ముట్టడికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన జరగనుంది.

ఇదీ చదవండి:విశాఖ ఉక్కు అమ్మేస్తాం.. రామాయపట్నం పోర్టుకు డబ్బులివ్వలేం: కేంద్రం

Last Updated : Mar 8, 2021, 10:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details