విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉద్యమాన్ని జాతీయస్థాయిలో ఉద్ధృతం చేయాలని.. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉద్యమ కార్యాచరణపై కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఆగస్టు 2, 3 తేదీల్లో 3 వేలమంది కార్మికులతో చలో పార్లమెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తెలంగాణ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతామని వివరించారు. ఈ నెల 21, 22 తేదీల్లో అందరి మద్దతు కోరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.