మహారాష్ట్ర నుంచి ఆక్సిజన్ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమకు గురువారం వచ్చి వెళ్లిన రైలుతో పాటు, ట్యాంకర్ల చుట్టూ ఉక్కు నినాదాలతో కూడిన పోస్టర్లు, ఫ్లెక్సీలను కార్మికులు, నిర్వాసితులు అతికించారు. ‘సేవ్ విశాఖ స్టీల్, విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు, ఉక్కుకి సొంత గనులు కేటాయించాలి’ అంటూ నినాదాలు వాటిపై రాశారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఉక్కు పోరాట తీవ్రత తెలిసేలా, కేంద్రం దిగి వచ్చేలా ఈ ప్రయత్నం చేసినట్లు పోరాట కమిటీ సభ్యులు తెలిపారు.
ఊపిరి నిలిపే 'ఉక్కు'ని కాపాడండి! - మహారాష్ట్రకు వెళుతున్న ట్యాంకర్స్పై విశాఖ ఉక్కు పరిశ్రమ పోస్టర్లు న్యూస్
కొవిడ్ బాధితులకు అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందిస్తూ... ప్రాణదాతగా నిలుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని కోరుతూ కార్మికులు, నిర్వాసితులు వినూత్న ప్రచారం సాగించారు. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఆక్సిజన్ రైలు, ట్యాంకర్ల చుట్టూ ఉక్కు నినాదాలతో కూడిన పోస్టర్లను అంటించారు.
vishaka steel plant posters on oxygen tankers