ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖకు పది నాటికల్‌ మైళ్ల దూరంలోనే నౌకలు - విశాఖకు పది నాటికల్‌ మైళ్ల దూరంలోనే నౌకలు

కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. అటు నౌకాదళం కూడా కరోనా ప్రభావిత దేశాల నుంచి వస్తున్న నౌకలపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో అయితే విశాఖ నౌకాశ్రయానికి పది నాటికల్ మైళ్ల దూరంలోనే ఇతర దేశాల నౌకలను నిలిపివేస్తున్నారు. అక్కడే 14 రోజుల క్వారంటైన్‌ సమయం ముగిసిన తర్వాతే.. విశాఖ నౌకాశ్రయం బట్టీల వద్దకు అనుమతిస్తున్నారు.

vishaka navy alert on corona virus
vishaka navy alert on corona virus

By

Published : Mar 17, 2020, 12:26 PM IST

కరోనా ప్రభావిత దేశాల నుంచి వస్తున్న నౌకలను విశాఖ నౌకాశ్రయానికి పది నాటికల్‌ మైళ్ల దూరంలోనే బంగాళాఖాతంలో నిలిపివేస్తున్నారు. 14 రోజుల క్వారంటైన్‌ సమయం ముగిసిన తర్వాతే వాటిని విశాఖ నౌకాశ్రయం జట్టీల వద్దకు అనుమతిస్తున్నారు. కరోనా ప్రభావిత దేశం నుంచి బయలుదేరిన తర్వాత 14 రోజుల కాలాన్ని క్వారంటైన్‌ సమయంగా పరిగణిస్తున్నారు. సుదూర దేశాల నుంచి విశాఖ వచ్చేనాటికి 14 రోజులు దాటితే అలాంటి నౌకలను మాత్రం అనుమతిస్తున్నారు. తొలుత వీటిని పది నాటికల్‌ మైళ్ల దూరంలోనే నిలిపి అందులోని మాస్టర్‌ నుంచి ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిగతులను సేకరిస్తున్నారు. ప్రమాదం లేదని నిర్ధరించుకున్న తర్వాత మాత్రమే నౌకను నౌకాశ్రయంలోకి అనుమతిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details