ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి ఐకానిక్ భవనంగా ఉండాలనే లక్ష్యంతో నిర్మాణమైన మిలీనియం టవర్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు విశాఖలోని 3 వేర్వేరు భవనాల్లో సేవలు అందించిన కాండ్యుయెంట్ సంస్థ... మిలీనియం టవర్స్‌లోకిఅడుగుపెట్టింది. కాండ్యుయెంట్ భారత కీలక కేంద్రంగా మిలీనియం టవర్స్ను మలుచుకుంది. ఈ కంపెనీలో ఇప్పటికే 15 వందల మందికిపైగా ఉద్యోగాలు పనిచేస్తున్నారు. మరో నెల రోజుల్లో మరిన్ని కంపెనీలు మిలీనియం టవర్స్ నుంచి పని చేసేందుకు విశాఖవస్తాయని ముఖ్యమంత్రి ఐటీ సలహాదారుజేఏ చౌదరి వెల్లడించారు.మధురవాడ ఐటీ హిల్స్పై 4ఎకరాల విస్తీర్ణంలో 145 కోట్ల రూపాయలతో నిర్మాణమైన మిలీనియం టవర్స్కాండ్యుయెంట్ రాకతో సందడిగా మారింది. తమ కార్యకలాపాలను విశాఖలో మరింత విస్తరించే దిశగా ఆలోచనలుచేస్తున్నట్లు కంపెనీ సీఈఓలు చెబుతున్నారు. నైపుణ్యం కలిగిన యువత, రాష్ట్ర ప్రభుత్వ సహకారమే విశాఖలో తమ సంస్థ విస్తరించేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వారు తెలిపారు.సాధారణ బీపీఓ ఉద్యోగాల నుంచి ఫిన్ టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక అంశాలపైనా కాండ్యుయెంట్ సేవలు అందిస్తోంది. ఆ దిశగా త్వరితగతిన విస్తరించేందుకు, మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రయ త్నాలు చేస్తోంది.