ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగనన్న హౌసింగ్ పనులపై కలెక్టర్ వినయ్​చంద్ సమీక్ష - collector vinay chand

విశాఖ జిల్లాలో జగనన్న హౌసింగ్ మొదటి దశ పనుల పురోగతిపై కలెక్టర్ వినయ్​చంద్ సమీక్షించారు. మౌళిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో చర్చించారు. పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

collector review on jagananna housing scheme
జగనన్న హౌసింగ్ పనులపై కలెక్టర్ వినయ్ చంద్ సమీక్ష

By

Published : Jun 1, 2021, 8:03 PM IST

జగనన్న హౌసింగ్ మొదటి దశ గ్రౌండింగ్ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ వి. వినయ్​చంద్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావును ఆదేశించారు. మొదటి దశ పనుల పురోగతిపై హౌసింగ్, గ్రామీణ నీటి సరఫరా, ఏపీ ఈపీడీసీఎల్ అధికారులతో సమీక్షించారు.

మొదటి దశలో భాగంగా భీమిలి, పెందుర్తి నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో హౌసింగ్ లేఔట్ల పురోగతిపై కలెక్టర్ చర్చించారు. పూర్తి వివరాలను నియోజకవర్గాల ప్రత్యేకాధికారులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. లేఔట్లలో మౌళిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details