ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సింహగిరిపై చందనం అరగదీత ప్రారంభం - simhachalam latest news

విశాఖ సింహగిరిపై జరగనున్న అప్పన్నస్వామి చందనోత్సవాన్ని(ఈ నెల 14) పురస్కరించుకుని చందనం చెక్కలను అరగదీసే ప్రక్రియకు నేడు శ్రీకారం చుట్టారు. ఉదయం 6 గంటలకు అర్చకులు చందనం చెక్కలకు పూజలు నిర్వహించి గంధం అరగదీతను సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు.

vishaka chandhanam aragateetha started
vishaka chandhanam aragateetha started

By

Published : May 7, 2021, 1:35 PM IST

సింహగిరిపై చందనం అరగదీత ప్రారంభం

ఈ నెల 14న జరగబోయే.. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ చైత్ర బహుళ ఏకాదశి సందర్భంగా.. చందనం అరగదీతను ప్రారంభించారు. పూర్వాచారం ప్రకారం భాండాగారంలో భద్రపరిచిన చందనం చెక్కలను తీసి.. బేడా మండపం చుట్టూ తిరిగి చందన సాన దగ్గర విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన కార్యక్రమాలను జరిపించారు. అనంతరం చందన సాన ముహూర్తాన్ని ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమాచార్యులు మొదలుపెట్టారు. ఐదు రోజులపాటు సుమారు 125 కిలోల గంధాన్ని అరగదీస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details