Traffic police released road accidents cctv videos: విశాఖనగరంలో ఇటీవల కాలంలో పలు ప్రధాన కూడళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు రికార్డ్ చేశాయి. రెప్పపాటు నిర్లక్ష్యం, అజాగ్రత్త.. నిండు ప్రాణాల్ని ఎలా బలితీసుకుంటుందో ఈ వీడియోలు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒకచోట ప్రతిరోజు ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటుంది.
Accidents: రోడ్డు ప్రమాదాలపై అవగాహన.. సీసీ పుటేజీల విడుదల..
Road accidents cctv videos: రోడ్డు ప్రమాదాలు జీవితాల్ని ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయో తెలుపుతూ విశాఖనగరంలో ట్రాఫిక్ పోలీసులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. తెలిసి చేసే చిన్నపాటి తప్పిదం ఎలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయో తెలుపుతూ యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వేగంపై నియంత్రణ లేకపోతే కలిగే ప్రమాదాలు, భద్రతాపరమైన చర్యలు చేపట్టకపోతే కలిగే నష్టాలను వివరిస్తూ వివిధ ఘటనల్లో జరిగిన ప్రమాదాల సీసీ పుటేజీలను విడుదల చేసి అవగాన కల్పిస్తున్నారు.
రోడ్డు ప్రమాదలపై అవగాహన
హెల్మెట్ ధరించకపోవడంవలన ప్రమాదానికి గురై కొందరు చనిపోతే.. హెల్మెట్ ధరించి కూడా క్లిప్ పెట్టుకోకపోవడం వలన అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, జిగ్ జాగ్ డ్రైవింగ్, బైక్ రేసింగ్ కు పాల్పడుతున్న 200 మంది యువకులకు గుర్తించారు. వారికి నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ కౌన్సెలింగ్ నిర్వహించారు. వారందరికి ప్రమాదకరమైన రోడ్డు ప్రమాదాల వీడియోలను చూపించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని అవగాహన కల్పించారు.
ఇవీ చదవండి: