ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులు! - rtc latest news

విశాఖ పరిధిలో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు పెంచుకుంటోంది. వచ్చే నెల నుంచి పూర్తిస్తాయిలో ఆర్టీసీ బస్సులు తిప్పడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.

visakhapatnam-regional-rtc
విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ

By

Published : Dec 19, 2020, 10:45 AM IST


కరోనా ప్రభావం తగ్గడంతో... విశాఖ ఆర్టీసీ సిబ్బంది.. ఆక్యుపెన్సీ రేట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు అనుమతి ఇస్తే.. వచ్చే నెల నుంచి అద్దె బస్సులతో కలిపి నూరు శాతం సర్వీస్​లు తిప్పడానికి అధికారులు సిద్ధమయ్యారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా... చేస్తున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయని విశాఖ ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు కొవిడ్ బారిన పడిన కేసులు నమోదు కాకపోవడం మరింత ఉత్సాహాన్ని అందిస్తోందని అన్నారు.

ప్రస్తుతం ఓఆర్ 67 శాతం ఉందని, మున్ముందు మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రయాణికులు కూడా 30 వేల బస్ పాస్​లు తీసుకుని అర్బన్ సర్వీసులో ప్రయాణాలు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య 50 వేలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. పరిశుభ్రమైన బస్సులను ప్రయాణికులకు అందిస్తున్నట్టు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details