ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీ ఎక్స్పోలో విశాఖ నగరం సత్తా చాటింది. 'లివింగ్ అండ్ ఆక్ససబిల్ లైఫ్' అనే విభాగంలో తుది జాబితాకు ఎంపికైన మూడు నగరాల్లో ఒకటిగా ఉక్కు నగరం నిలిచింది. బ్రెజిల్ దేశం ఈ అవార్డును దక్కించుకున్నప్పటికీ ప్రతిష్ఠాత్మక పోటీలో తుది వరకు నిలవడం పట్ల జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన హర్షం వ్యక్తం చేశారు.
స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా విశాఖలో దివ్యాంగులైన చిన్నారుల కోసం నిర్మించిన 'ఆల్ ఎబిలిటీస్' పార్కును ఈ కేటగిరీలో పోటీకి నిలిపారు. 46 దేశాల సరసన జరిగిన పోటీల్లో భారత్ నుంచి చివరి వరకు నిలిచిన నగరంగా విశాఖ ఘనత సాధించింది. ఈ స్ఫూర్తితో వచ్చే ఏడాది విభిన్న కేటగిరీల్లో పోటీ చేసి విశాఖ ఖ్యాతిని మరింత పెంచుతామని కమిషనర్ ధీమా వ్యక్తం చేశారు