ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ధర లేక.. లాభం రాక.. కూరగాయల రైతులకు తీవ్ర నష్టాలు - విశాఖపట్నం జిల్లా తాజా రైతులు వార్తలు

సరైన గిట్టుబాటు ధర లభించక దేవరాపల్లి మార్కెట్​ రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

visakhapatnam farmers not getting minimum price urges to government
సరైన ధరలు లేక దిగాలు పడ్డ రైతులు

By

Published : May 4, 2020, 12:05 PM IST

కష్టపడి పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర లభించకని కారణంగా.. విశాఖపట్నం రైతులు ఇబ్బంది పడుతున్నారు. దేవరాపల్లిలోని మార్కెట్​కు పరిసర గ్రామాల నుంచి రైతులు ఆదివారం కూరగాయలను తీసుకొచ్చారు. కనీసం గిట్టుబాటు ధర కూడా లభించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

కూరగాయలను తిరిగి తీసుకెళ్లలేక తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయించారు. ఎక్కువ మొత్తంలో వచ్చిన నల్ల వంకాయలు కేజీ రూ.2 రూపాయలు కూడా పలకలేదు. ఈ కారణంగా.. కొందరు రైతులు తిరిగి తీసుకెళ్లలేక మార్కెట్ లోనే పారబోశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details