చెన్నైలో ఇటీవల నిర్వహించిన కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా ఆన్‌లైన్ ఫ్యాషన్ పోటీల్లో విశాఖ నగరంలోని కూర్మన్నపాలేనికి చెందిన యువతి కె.దుర్గాభవాని విజేతగా నిలిచింది. చెన్నైకి చెందిన ఇండియన్ మీడియా వర్క్స్ సీఈఓ జాన్ అమలాన్ ఆధ్వర్యంలో జూన్ 28 నుంచి ఆగస్టు 25 వరకు ఈ పోటీలు నిర్వహించారు. 16 ఏళ్ల నుంచి 40ఏళ్ల లోపు వయసు విభాగంలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు జరిగాయి. తండ్రి సత్యనారాయణ, తల్లి వరలక్ష్మిల సహకారంతో పోటీల్లో గెలవగలిగానని దుర్గాభవాని చెప్పారు.
క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియాగా విశాఖ యువతి - విశాఖ వార్తలు
క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా కిరీటాన్ని విశాఖ జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన యువతి దక్కించుకుంది. ఇండియన్ మీడియా వర్క్స్ సీఈవో జాన్ అమలాన్ సారథ్యంలో... జూన్ 28 నుంచి ఆగస్టు 25 వరకు చెన్నై కేంద్రంగా ఈ పోటీలు జరిగాయి.
క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియాగా విశాఖ యువతి
Last Updated : Sep 1, 2020, 10:47 AM IST