ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్టీల్​ప్లాంట్​ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సీఎంకు కార్మిక సంఘాల వినతి - విశాఖ తాాజా వార్తలు

స్టీల్ ​ప్లాంట్​ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ప్రైవేటీకరణ జరిగితే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని.. ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని సీఎంకు వినతిపత్రం అందజేశారు.

visakha Trade unions requested to CM
సీఎంకు కార్మిక సంఘాల వినతి

By

Published : Mar 24, 2021, 10:38 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆల్‌ ఇండియా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి నేతృత్వంలో కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రి జగన్​ను కలిసి వినతి పత్రం అందజేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కును కాపాడుకోవాలని.. ప్రైవేటీకరణ జరిగితే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని అన్నారు. ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని ఉక్కు కార్మిక నేతలు ముఖ్యమంత్రిని కోరారు.

ABOUT THE AUTHOR

...view details