ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెన్సిల్ లెడ్​తో​ ప్రపంచ రికార్డు ... విశాఖ యువకుడి ప్రతిభ - పెన్సిల్ లెడ్​తో మైక్రో ఆర్ట్స్

కరోనా లాక్​డౌన్​లో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. కొందరు ఇంటి పనులు చేస్తే, మరి కొందరు వంటలు నేర్చుకున్నారు. ఇంకొందరు తమలోని సృజన బయటపెట్టేందుకు ప్రయత్నించారు. ఆ కోవకే చెందుతాడు విశాఖకు చెందిన ఓ యువకుడు. పెన్సిల్​ లెడ్​తో మైక్రో ఆర్ట్స్ చేస్తూ రికార్డులు సాధిస్తున్నాడు.

పెన్సిల్ లెడ్​తో ప్రపంచ రికార్డు.. విశాఖ యువకుడి ప్రతిభ
పెన్సిల్ లెడ్​తో ప్రపంచ రికార్డు.. విశాఖ యువకుడి ప్రతిభ

By

Published : Jul 1, 2020, 7:30 PM IST

పెన్సిల్ లెడ్​తో​ ప్రపంచ రికార్డు ... విశాఖ యువకుడి ప్రతిభ

పెన్సిల్​ లెడ్​తో సూక్ష్మ ఆకృతిలో పేర్లు, బొమ్మలు చెక్కుతున్నాడు విశాఖకు చెందిన గోపాల్. విశాఖ పూతినవారి మాన్యంలో నివాసం ఉంటున్న ఈ యువకుడు... ఓ ప్రైవేటు కళాశాలలో బి.టెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కరోనా కారణంగా వచ్చిన సెలవుల్లో ఇంట్లో ఉన్న గోపాల్.. తన సృజనకు పదువుపెట్టాడు. పెన్సిల్​ లెడ్​తో ఆర్ట్స్ చేయడం మొదలుపెట్టాడు.

పెన్సిల్ లెడ్​పై అన్ని రాష్ట్రాల పేర్లు

గతంలో ఏ నుంచి జెడ్ వరకు లెడ్​పై అక్షరాలు చెక్కి... ఓ వ్యక్తి వరల్డ్ రికార్డు సాధించాడు.ఆ రికార్డు అధిగమించే ఉద్దేశంతో పెన్సిల్​ లెడ్​పై 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు చెక్కాడు. దీనిని వజ్రా వరల్డ్​ రికార్డ్సు సంస్థ గుర్తించింది. ఇండియా బుక్​ రికార్డ్స్​లోనూ స్థానం పొందాడు. కరోనాలోనూ తన కష్టానికి ఒక ప్రతిఫలం దక్కిందని గోపాల్ చెప్తున్నాడు. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఈప్రయత్నాలు చేస్తున్నానని గోపాల్ అంటున్నాడు.

వజ్ర వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు

పదో తరగతి చదువుతున్నప్పుడు ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ కళను ప్రారంభించానని గోపాల్ చెప్తున్నాడు. సరదాగా మొదలుపెట్టిన ఈ కళతో రికార్డులు అందుకోవటం ఆనందంగా ఉందన్నాడు. తమ కుమారుడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంపై కుటుంబసభ్యులు సంబరపడుతున్నారు.

ఇదీ చదవండి :'బ్లాస్ట్ 1.ఓ'... కరోనా పోరులో తిరుపతి ఐఐటీ వినూత్న ఆవిష్కరణ..

ABOUT THE AUTHOR

...view details