2020-21 ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు రూ.18 వేల కోట్ల టర్నోవర్ నమోదు చేసినట్లు సీఎండీ పీకే రథ్ తెలిపారు. ఇది విశాఖ ఉక్కు చరిత్రలోనే రెండో అత్యధికమని వివరించారు. ఆర్థిక సంవత్సరం పూర్తయిన సందర్భంగా... విశాఖ ఉక్కు ప్రగతిపై సీనియర్ అధికారులతో సీఎండీ సమీక్ష నిర్వహించారు.
విశాఖ ఉక్కు: 2020-21 టర్నోవర్ రూ.18వేల కోట్లు - visakha steel plant Income news
18:04 April 01
కిందటి ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు రూ.18వేలకోట్ల టర్నోవర్ నమోదు చేసినట్లు సీఎండీ పీకే రథ్ తెలిపారు. విశాఖ ఉక్కు ప్రగతిపై సీనియర్ అధికారులతో సీఎండీ సమీక్ష నిర్వహించారు. ఈ 4 నెలల్లో రూ.740కోట్ల నికర లాభం నమోదైందని వెల్లడించారు.
కిందటి ఆర్థిక ఏడాదిలో కర్మాగారం 13 శాతం వృద్ధి నమోదు చేసిందన్నారు. ఈ 4 నెలల్లో రూ.740 కోట్ల నికర లాభం నమోదైందని వెల్లడించారు. మార్చిలో 7,11,000 టన్నుల ఉక్కు రూ. 3,300 కోట్లకు విక్రయించినట్టు చెప్పారు. ఈ మార్చిలో కర్మాగారం చరిత్రలో అత్యధిక ఆదాయం వచ్చిందన్నారు. కార్మికులు, సిబ్బంది, అధికారులకు సీఎండీ అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: