ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దర్యాప్తు మొదలుపెట్టిన సిట్... భూఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరణ - విశాఖ లాండ్ స్కామ్​పై సిట్ విచారణ

విశాఖ భూ ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నూతన సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు ప్రారంభించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ బృందం శుక్రవారం నుంచి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది. ఈ నెల 7వరకు ఫిర్యాదులు స్వీకరించినున్నట్లు అధికారులు తెలిపారు.

దర్యాప్తు మొదలుపెట్టిన సిట్... భూఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరణ

By

Published : Nov 2, 2019, 6:17 AM IST

దర్యాప్తు మొదలుపెట్టిన సిట్... భూఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరణ
విశాఖ భూ ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. భూములపై వ్యవహారంపై వీఎంఆర్​డీఏ చిల్డ్రన్ థియేటర్ వేదికగా వారం రోజులు పాటు ప్రజాఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం చేపట్టింది. నవంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రజాఫిర్యాదులు స్వీకరించనున్నారు. సిట్ సభ్యులు విశ్రాంత ఐఏఎస్ అధికారి అనురాధ, భాస్కర్​రావు స్వయంగా ప్రజాఫిర్యాదుల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. 13 మండలాలను 14 విభాగాలుగా విభజించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఫిర్యాదుదారుల కోసం ఆరు సేవకౌంటర్లు ఏర్పాటుచేశారు. వారం రోజుల పాటు ఫిర్యాదులు స్వీకరించి వాటిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. శుక్రవారం ప్రజల నుంచి 79 ఫిర్యాదులు రాగా, వాటిలో 14 ఫిర్యాదులు మాత్రమే సిట్ బృందం విచారణ పరిధిలోకి తీసుకుంది. విశాఖ పరిసర భూముల విషయంలో ఏళ్లుగా జరుగుతున్న జాప్యాన్ని విచారించి, న్యాయం చేయాలనీ ఫిర్యాదుదారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details