ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పిల్లల అత్యవసర వైద్య విభాగంలో విశాఖ వైద్యుడికి బంగారు పతకం - విశాఖకు చెందిన యువ వైద్యులు రౌతు సంతోష్ కుమార్

Dr Santhosh Kumar: దేశంలో వైద్య విద్యలో కొత్త సూపర్ స్పెషాలిటీ కోర్సులు యువ వైద్యులకు ఒక సవాల్​గా మారాయి​. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న పిల్లల అత్యవసర వైద్యానికి సంబంధించిన విభాగంలో నిపుణుల అవసరం ఎంతగానో ఉంది. ఇందులో ఈ సూపర్ స్పెషాలిటీలో కేవలం జాతీయ స్దాయి వైద్య విద్యా సంస్ధలైన దిల్లీ ఎయిమ్స్, చండీగడ్, పాండిచ్చేరి వంటి లెక్కపెట్టదగ్గ సంస్ధలలోనే కేవలం పదిలోపు సీట్లే అందుబాటులో ఉన్నాయి. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ పాండిచ్చేరి జిప్మర్​లో ఈ సూపర్ స్పెషాలిటీలో సీటు పొందడమే కాకుండా.. కోర్సు పూర్తి చేసి అందులోనూ బంగారు పతకాన్ని సాధించారు విశాఖకు చెందిన యువ వైద్యులు రౌతు సంతోష్ కుమార్. పిల్లల అత్యవసర వైద్యంపై అవగాహన పెంపొందాల్సి ఉంటుందంటున్న డాక్టర్ సంతోష్ కుమార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

Dr Santhosh Kumar
డాక్టర్ సంతోష్ కుమార్

By

Published : Sep 1, 2022, 6:17 PM IST

Dr Santhosh Kumar: విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన రౌతు సంతోష్ కుమార్ మధ్య తరగతి కుటుంబంలోనే పుట్టినా తల్లిదండ్రుల శ్రమ, సమాజంలో వైద్యులకు లభించే గౌరవం చూసి డాక్టర్​ కావాలనే కల కన్నాడు. చిన్నప్పటి నుంచి చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూ.. సంతోష్ జాతీయ స్దాయిలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ఎంబీబీఎస్ కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో ప్రవేశం పొందాడు. జాతీయ స్దాయిలో పోటీ ద్వారా జాతీయ స్దాయిలోనే ప్రతిష్టాత్మకమైన ఛండీగడ్ వైద్య కళాశాలలో పిల్లల వైద్యంలోనూ డిగ్రీ పూర్తి చేశారు. వైద్యునిగా సేవలందిస్తూనే ఇందులో సూపర్ స్పెషాలిటీ కోర్సులో సీటు సాధించేందుకు పోటీ పడ్డారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వైద్య విద్యా సంస్ధలైన దిల్లీ ఎయిమ్స్, ఛండీగడ్​, పాండిచ్చేరిలలో మాత్రమే ఇవి ఒకటి, రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. దీనిని సాధించడం ఒక సవాలుగా తీసుకుని పాండిచ్చేరిలో మూడేళ్ల ఈ కోర్సులో సీటు సాధించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.

వైద్య వృత్తి అంటేనే ఒక సవాలు అనుకుంటే అందునా పిల్లల వైద్యం మరింత క్లిష్టమన్నది తెలిసిందే. దీనిలోనూ అత్యవసర, ప్రాణాపాయ స్ధితిలో పిల్లల వైద్యం ప్రతి క్షణం యముడితో పోరాడి ఆ పసివాళ్ల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత ఈ ప్రత్యేక వైద్య నిపుణులపైనే ఉంటుంది. అటువంటి ఈ కోర్సును మూడేళ్ల పాటు పూర్తి చేయడమే కాకుండా.. ప్రతిష్టాత్మకమైన జిప్మర్ సంస్ధలో డాక్టర్ సత్యమూర్తి స్మారక బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్​గా బంగారు పతకాన్ని సాధించి ఒక రికార్డు నెలకొల్పారు. డాక్టర్ సంతోష్ కుమార్ సతీమణి శుశ్రుత కూడా ఈఎన్టీ వైద్యురాలే. ప్రస్తుతం డాక్టర్ సంతోష్ కుమార్ గాజువాక ఐకాన్ ఆసుపత్రిలో పిల్లల వైద్య విభాగాధిపతిగా సేవలందిస్తున్నారు.

అత్యంత ఒత్తిడితో కూడుకున్న వైద్య విభాగమైన చిన్నపిల్లల అత్యవసర విభాగంలో నిపుణుల అవసరం చాలా ఉందని చెబుతున్న ఈ వైద్య నిపుణుడు తన అంతరంగాన్ని, కార్యాచరణను, యువ వైద్యులు ఈ విభాగాన్ని ఎందుకు ఎంచుకోవాలన్న అంశాలను పంచుకున్నారు.

డాక్టర్ సంతోష్ కుమార్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details