ఓట్ల లెక్కింపు సందర్భంగా భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు. ఓట్ల లెక్కింపునకు పోలీసు శాఖ తరఫున సిద్ధమని... అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లతో మాట్లాడామన్న సీపీ... ఉదయం 5.30 గంటల నుంచి పాసులున్న వారిని లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతిస్తామని వివరించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం, కౌంటింగ్ జరిగే ప్రదేశాలలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది: విశాఖ సీపీ - విశాఖ నగర పోలీస్ కమిషనర్
ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు.
విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా