ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు... యథేచ్ఛగా చేపల విక్రయాలు - విశాఖలో ఇవాళ యథేచ్ఛగా చేపల విక్రయాలు

ఇవాళ మాంసం, చేపలు, రొయ్యల విక్రయాలు నిలిపివేస్తూ.. విశాఖ నగర పాలక సంస్థ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ కొందరు వ్యాపారులు ఇవేమీ పట్టించుకోకుండా యథావిధిగా అమ్మకాలు కొనసాగించారు. కొన్ని దుకాణాలను గుర్తించిన పోలీసులు వాటిని మూసివేయించారు. ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

visakha police close fish shops
విశాఖలో చేపల దుకాణాలు మూసివేయించిన పోలీసులు

By

Published : May 23, 2021, 4:00 PM IST

విశాఖ నగరంలోని చేపల దుకాణలను పోలీసులు మూసివేయించారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం.. మాంసం, చేపలు, రొయ్యల అమ్మకాలపై నగర పాలక సంస్థ ఇవాళ నిషేధం విధించింది. కానీ కొందరు ఈ ఆదేశాలను పట్టించుకోకుండా యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగించారు. కొన్నిచోట్ల మార్కెట్​లోకే చేపలు తెచ్చి విక్రయించారు. బహిరంగంగా చేపలు అమ్మే దుకాణాలను పోలీసులు గుర్తించి మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపొతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని.. గాజువాక, పెద్ద గంట్యాడ, గోపాలపట్నంకు చెందిన పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details