ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ నిబంధనలు గాలికొదిలేస్తున్న విశాఖ వాసులు - విశాఖలో కొవిడ్ నిబంధనల అమలు

రోజూ 2 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్న విశాఖలో.. ప్రజలెవరూ కొవిడ్ నిబంధనలను పట్టించుకోవడం లేదు. కర్ఫ్యూ సడలింపు వేళలో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నారు.

visakha people not binding for covid norms
కొవిడ్ నిబంధనలు గాలికొదిలేస్తున్న విశాఖ వాసులు

By

Published : May 20, 2021, 4:29 PM IST

విశాఖ ప్రజలు కొవిడ్ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో అవసరమైతే కానీ బయటకు రావద్దని అధికారులు మొత్తుకుంటున్నా.. గుంపులు గుంపులుగా సంచరిస్తున్నారు. గాజువాక కూరగాయల మార్కెట్ వద్ద పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటోంది. ఇప్పటికే విశాఖలో రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. ఆంక్షలను సైతం పట్టించుకోకుండా ప్రజా కదలికలు భయాన్ని సృష్టిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details