పుర, నగరపాలక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార వైకాపా పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. రాష్ట్రంలోని అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫ్యాన్ దూకుడు కొనసాగగా.. తాజాగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)ను కూడా వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 98 డివిజన్లలో వైకాపా 58 డివిజన్లు సాధించి.. కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇక తెదేపా 30, జనసేన 3, భాజపా, సీపీఎం, సీపీఐ ఒక్కొక్క స్థానంలో విజయం సాధించాయి. ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు.
అయితే 89వ వార్డుకు రీకౌంటింగ్ నిర్వహించగా.. 73 ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థి విజయం సాధించారు.