విశాఖ నగరం బురుజుపేటలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలపై.. జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు.. ఆలయంలో మార్గశిర మాసోత్సవాల జరగనున్నాయి. వాటి నిర్వహణపై దేవాలయంలో పలువురు అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
భక్తులకు సౌకర్యాల కల్పన, కొవిడ్ నిబంధనలు అమలు తదితర అంశాలపై వివిధ శాఖల సిబ్బందితో జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. కీలకమైన గురువారాలలో మరిన్ని నిర్దిష్ట ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆలయ ఈవోతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.