రాష్ట్ర రాజధానికి విశాఖ అత్యంత అనుకూలమైన ప్రాంతమని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్ అన్నారు. వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. విమాన, రైల్వే, సముద్ర, జాతీయ రహదారి అనుసంధానం కలిగిన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సత్వరం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కొద్ది సంవత్సరాల్లోనే పరిపాలనా రాజధానిగా ఎదిగేందుకు విశాఖకు అన్ని మౌలిక వసతులు ఉన్నాయని అన్నారు. అమరావతి అభివృద్ధి చెందడానికి 50 ఏళ్లు పట్టే అవకాశం ఉందని...అన్ని వసతులు ఉన్న విశాఖను రాజధానిగా చేస్తే సత్వర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
'రాజధానికి విశాఖ అత్యంత అనుకూలమైన ప్రాంతం' - మూడు రాజధానులు
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఉత్తరాంధ్ర వేదిక సమర్థించింది. పరిపాలనా రాజధానిగా ఎదిగేందుకు విశాఖలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయని అన్నారు.
ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్