Visakha Bandh : ఈ నెల 28వ తేదీన తలపెట్టిన విశాఖ బంద్‌కు అన్ని పార్టీలు సహకరించాలని కోరుతూ...అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైకాపా ఎంపీలు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో తమ గళం వినిపించాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పీలా శ్రీనివాసరావు కోరారు. విశాఖలో ఒక విధంగా, దిల్లీలో మరో విధంగా వ్యవహరించరాదని హితవు పలికారు. విశాఖలో తలపెట్టిన బంద్‌లో వైకాపా నేతలు ప్రత్యక్షంగా పాల్గొనాలని డిమాండ్ చేశారు.
'ఈ నెల 28న విశాఖ బంద్.. అందరు సహకరించాలి' - విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వార్తలు
Visakha Bandh : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 28న తలపెట్టిన విశాఖ బంద్‌కు అందరు సహకరించాలని అఖిలపక్ష నేతలు కోరారు. ఈ బంద్‌లో వైకాపా నేతలు ప్రత్యక్షంగా పాల్గొనాలని తెదేపా నేత పీలా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వైకాపా ఎంపీలు విశాఖలో ఒక విధంగా, దిల్లీలో మరో విధంగా వ్యవహరించరాదన్నారు.
Visakha Bandh
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తే వేలాది మందికి ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఐఎన్డీయూసీ నాయకుడు రాజశేఖర్ తెలిపారు. భాజపా ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు విక్రయించాలని కుట్రపన్నుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐటీయూ నాయకులు, తెదేపా నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:విశాఖ బంద్‌కు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి పిలుపు...ఎప్పుడంటే..?