వేతన ఒప్పందం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులు సమ్మె చేపట్టారు. నాలుగున్నరేళ్లు నుంచి వేతన ఒప్పందం చేయకపోగా.. ప్రరిశ్రమ ప్రైవేటీకరణకు యత్నిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సెయిల్, RINL, ఉక్కు శాఖతో చర్చలు విఫలమైనందునే సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ త్యాగాలతో సాధించుకున్నదని..అటువంటి స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని చూడటం అన్యాయమన్నారు.
Protest: 'విశాఖ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం ఉద్ధృతం' - విశాఖ ఉక్కు తాజా వార్తలు
వేతన ఒప్పందం అమలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు సమ్మె చేపట్టారు. సెయిల్, RINL, ఉక్కు శాఖతో చర్చలు విఫలమైనందునే సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. త్యాగాలతో వచ్చిన స్టీల్‌ప్లాంట్‌ను త్యాగాలు చేసైనా ప్రైవేటీకరణ నుంచి కాపాడుకుంటామని తేల్చిచెప్పారు.
విశాఖ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం ఉద్ధృతం
కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కార్మిక సంఘం నేతలు హెచ్చరించారు. INTUC మినహా అన్ని యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు.
ఇదీచదవండి: Sadhana Deeksha: సాధన దీక్షలో పాల్గొన్న చంద్రబాబు..