ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పరిపాలన రాజధాని విశాఖలో.. ప్రభుత్వ భూమిలోనే కార్యాలయాలు'

పరిపాలన రాజధాని విశాఖలో ప్రభుత్వ భూమిలోనే కార్యాలయాలని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

vijayasaireddy on vishaka as capital
vijayasaireddy on vishaka as capital

By

Published : Dec 20, 2020, 6:06 PM IST

విశాఖలో బాక్సైట్ తవ్వకాలను అనుమతించమని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఒడిశా నుంచి బాక్సైట్‌ తెచ్చి అన్‌రాక్‌ పరిశ్రమ నడిపే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అన్‌రాక్‌ వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.

పరిపాలన రాజధాని విశాఖలో ప్రభుత్వ భూమిలోనే కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ భూములపై సిట్ నివేదిక సిద్ధమని.. త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సి.కల్యాణ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details