రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి.. పార్క్ హయత్ రాజకీయం సరికాదు:విజయసాయిరెడ్డి - పార్క్ హయత్ పాలిటిక్స్ న్యూస్
నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి అలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
vijayasaireddy comments on nimmagadda ramesh kumar
నిమ్మగడ్డ రమేశ్ రాజ్యాంగ పదవిలో ఉండి పార్క్ హోటల్ లో రాజకీయ వ్యవహరం చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి అన్నారు. ఈ వ్యవహరంపై విచారణ జరగాలని కోరారు. కేంద్రానికి నిమ్మగడ్డ రమేశ్ రాసిన ఉత్తరం ఆయన రాసిన లేఖ కాదని, తెదేపా కార్యాలయంలో తయారైనట్టు ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డకు.. ఎంపీ సుజనాకు వ్యాపార లావాదేవీలు ఏముంటాయని ప్రశ్నించారు. పార్క్ హయత్‌లో జరిగిన వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.