వైకాపా అధినేత జగన్కు.. విశాఖ రాజకీయ అంశాలు తెలియజేసి పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు నష్టం జరగకుండా చూస్తానని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్కు ఘన నివాళి అంటే.. ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికలొచ్చినా... విశాఖలో ఎక్కువ స్థానాలు గెలిపించడమేనని వ్యాఖ్యానించారు. విశాఖ వైకాపా కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సభలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు న్యాయం జరిగే విధానాలతో పార్టీ ముందుకు వెళ్తోందని చెప్పారు. విశాఖ నగారాభివృద్ధి జరిగిందంటే అది వైఎస్ఆర్ హయాంలోనే అని పేర్కొన్నారు.
'జీవీఎంసీలో అభ్యర్థుల ప్రకటనతో కార్యకర్తలు బాధపడ్డారు' - జీవీఎంసీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి కామెంట్స్
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రకటనతో చాలామంది కార్యకర్త్తలు బాధపడ్డారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. కొన్ని ఒత్తిళ్లతో పార్టీ నిర్ణయాలు తీసుకోవలసి వచ్చిందని వాటి వల్ల విశాఖలో కొందరు కార్యకర్తలకు ఇబ్బంది కలిగిందని చెప్పుకొచ్చారు.
'జీవీఎంసీలో అభ్యర్థుల ప్రకటనతో కార్యకర్తలు బాధపడ్డారు'