విశాఖలో పరిపాలన రాజధాని వస్తుందని.. భూముల రేట్లు పెరిగాయని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చాలామంది ప్రభుత్వ భూములు ఆక్రమించారని ఆరోపించారు. అందుకు సంబంధించిన సమాచారం ప్రజల దగ్గర ఉంటే.. ప్రభుత్వ అధికారులకు ఇవ్వాలని కోరారు. ఎంత పెద్ద వ్యక్తి అయినా... ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
'విశాఖలో భూములు ఆ సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి' - vijayasa reddy latest news
విశాఖలో పరిపాలన రాజధాని ప్రకటించాక రేట్లు బాగా పెరిగాయని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వ భూములు ఆక్రమించి కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించినవారిపై రాబోయే కాలంలో కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. విశాఖలో కాపు, యాదవ, వెలమ, మత్స్యకారులు ఉన్నప్పటికీ.. భూములు వేరే సామాజికవర్గం చేతిలోనే ఉన్నాయన్నారు. భూములు ఆక్రమించుకున్న కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమి ఒక్క అంగుళం ఆక్రమించుకున్నా... సహించే ప్రసక్తే లేదని, ప్రభుత్వ భూములన్నింటినీ పరిరక్షిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... 'వైఎస్ఆర్ ఆసరా'కు సీఎం జగన్ శ్రీకారం