లుకేమియా బాధితుల కోసం ప్రగతి భారతి ఫౌండేషన్, విశాఖ రెడ్‌క్రాస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ శిబిరాన్ని మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎంపీ విజయసాయి రెడ్డితో కలిసి ప్రారంభించారు. విజయసాయి రెడ్డి రక్తదానం చేశారు. లాక్డౌన్ కారణంగా రక్తం కొరత రాకూడదన్న లక్ష్యంతో వైద్య, పోలీసు శాఖల అనుమతులతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
లుకేమియా బాధితుల కోసం రక్తదానం చేసిన విజయసాయిరెడ్డి - ఎంపీ విజయసాయిరెడ్డి లెటెస్ట్ కామెంట్స్
లుకేమియా బాధితుల కోసం ప్రగతి భారతి ఫౌండేషన్, విశాఖ రెడ్‌క్రాస్ విభాగం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో.. ఎంపీ విజయసాయిరెడ్డి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు.
![లుకేమియా బాధితుల కోసం రక్తదానం చేసిన విజయసాయిరెడ్డి Vijaya sai reddy donates blood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6838009-823-6838009-1587188717160.jpg)
రక్తదానం చేస్తున్న విజయసాయిరెడ్డి
విశాఖలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి మోపిదేవి, ఎంపీ విజయసాయిరెడ్డి
ఇదీ చదవండి :నౌకా దళంలో కరోనా కలకలం- 21 మందికి వైరస్