1971లో దాయాది పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 16న విజయ్ దివాస్ నిర్వస్తున్నారు. ఈ యుద్ధం జరిగి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. విశాఖ ఆర్కే బీచ్‌లోని యుద్ధ స్మారకం 'విక్టరీ ఎట్ సీ' వద్ద అమరులైన సైనికులకు నేవల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ కె.ఎం. దేశ్‌ముఖ్ నివాళులు ఆర్పించారు. 50 మందితో కూడిన సాయుధ నావికులతో కవాతు నిర్వహించి, సైనిక వందనం సమర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
విశాఖ 'విక్టరీ ఎట్ సీ' వద్ద అమర జవాన్లకు నివాళులు - విశాఖ వార్తలు
1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర పోరులో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఈ విజయానికి ప్రతీకగా ప్రతీ ఏటా డిసెంబర్ 16న విజయ్ దివాస్ నిర్వహిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్‌లో ఉన్న 'విక్టరీ ఎట్ సీ' యుద్ధ స్మారకం వద్ద అమరులైన సైనికులకు నేవల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ కె.ఎం. దేశ్‌ముఖ్ నివాళులు అర్పించారు.
Vijay diwas 50th anniversary
1971లో తూర్పు పాకిస్థాన్‌లో స్వతంత్ర పోరు భారత్-పాక్ మధ్య యుద్ధానికి దారి తీసింది. ఇందులో పాక్‌ను భారత్ ఓడించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 16న విజయ్ దివస్ నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో సరిగ్గా ఇదేరోజున పాక్ ఆర్మీ 93 వేల మందితో భారత్ సైన్యానికి లొంగిపోయింది. 50 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన భారత సైన్యం ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచింది.
ఇదీ చదవండి :జాతీయ యుద్ధస్మారకం వద్ద ప్రధాని నివాళి
Last Updated : Dec 16, 2020, 6:03 PM IST