ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 19, 2020, 10:45 AM IST

ETV Bharat / city

అక్రమ తవ్వకాలపై విజిలెన్స్‌ దర్యాప్తు

సింహాచలం దేవస్థానం ఈవోగా ఎం.వెంకటేశ్వరరావు పనిచేసిన కాలంలో చోటు చేసుకున్న అక్రమ తవ్వకాలు, ఇతర అంశాలపై విజిలెన్స్‌ విచారణ ప్రారంభమైంది.

అక్రమ తవ్వకాలపై విజిలెన్స్‌ దర్యాప్తు
అక్రమ తవ్వకాలపై విజిలెన్స్‌ దర్యాప్తు

విశాఖ సింహాచలం దేవస్థానం భూములు, ఘాట్​ రోడ్డులో తవ్విన గ్రావెల్ అవినీతిపై విజిలెన్స్ శాఖ విచారణ చేపట్టింది. ఆ విభాగం ఏఎస్పీ బి.లక్ష్మీనారాయణ, డీఎస్పీ ఎ.నరసింహమూర్తి నేతృత్వంలో మంగళవారం సర్వే శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ గోపాలరాజు ఆధ్వర్యంలో ఈటీఎస్‌ (ఎలక్ట్రానిక్‌ టోటల్‌ స్టేషన్‌) సర్వే నిర్వహించారు. ఇక్కడి కొండను ఎంత తవ్వారు? వీటికి అనుమతులున్నాయా.. ఉంటే ఆ మేరకే తవ్వకాలు జరిగాయా? గ్రావెల్‌ను ఎక్కడికి తరలించారు? ఇలా పలు అంశాలు పరిశీలిస్తామని ఏఎస్పీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వీటి ఆధారంగా మిగిలిన అంశాలపైనా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అప్పన్న భూములపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయడంతో.... దేవస్థానంలో పనిచేస్తూ... అవినీతికి పాల్పడ్డ అధికారులు పై దర్యాప్తు ప్రారంభించారు. మాజీ ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వర హయాంలో అవినీతి జరిగినట్లు మీడియాలో కథనాలు రావడంతో ..నిగ్గు తేల్చే దిశగా విజిలెన్స్ అడుగులు వేస్తోంది.

ఇవీ చదవండి:ఇళ్ల పట్టాలకు ఆ స్థలాలొద్దు.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details