విశాఖ నగరంలోని ప్రముఖ సూపర్ మార్కెట్లలో... విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అదనపు ఎస్పీ స్వరూపరాణి ఆధ్వర్యంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కాలం చెల్లిన నిత్యవసర వస్తువులు విక్రయిస్తున్నారన్న సమాచారంతో... సోదాలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వస్తువుల నమూనాల్ని నాణ్యత పరీక్షలకు పంపామన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విశాఖలోని సూపర్ మార్కెట్లలో... విజిలెన్స్ అధికారుల తనిఖీలు - విశాఖపట్నం జిల్లా తాజా సమాచారం
విశాఖపట్నంలోని ప్రముఖ సూపర్ మార్కెట్లలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, కాలం చెల్లిన నిత్యావసర సరుకులను అమ్ముతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించారు.

విజిలెన్స్ అధికారుల తనిఖీలు