విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని పలు క్వారీల్లో గనుల శాఖ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ తనిఖీలు 15 రోజులపాటు చేపడుతున్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ ఏడీ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
Visakhapatnam: అనకాపల్లి క్వారీల్లో విజిలెన్స్ తనిఖీలు - అనకా పల్లి
అనకాపల్లిలోని పలు క్వారీల్లో అక్రమాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా గనుల శాఖ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 రోజుల పాటు ఈ తనిఖీలుంటాయని తెలిపారు.
విజిలెన్స్ తనీఖీలు
ఎంత మేర లీజుకు తీసుకున్నారు.. ఎంతమేర తవ్వకాలు చేపట్టారు.. తదితర విషయాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ జరిమానా విధిస్తామని ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీలకు వర్షం అడ్డంకిగా మారింది.