విశాఖలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తూర్పు నౌకా దళ ప్రధాన స్థావరాన్ని సందర్శించారు. ముందుగా తూర్పు నౌకా దళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ ఏకే జైన్, ఇతర ఉన్నత అధికారులు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. అక్కడి కార్యకలాపాలను వైస్ అడ్మిరల్.. ఉపరాష్ట్రపతికి వివరించారు. అనంతరం దేశీయంగా నిర్మాణమైన యుద్ధనౌక ఐఎన్ఎస్ సహ్యాద్రిని సందర్శించారు. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు నౌకా దళం సన్నద్ధంగా ఉందని వైస్ అడ్మిరల్ తెలిపారు. సిబ్బంది.. ఉపరాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు.
తూర్పు నౌకా దళ ప్రధాన స్థావరాన్ని సందర్శించిన ఉప రాష్ట్రపతి - తూర్పు నౌకాదళ స్థావరంలో వెంకయ్య నాయుడు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. విశాఖలోని తూర్పు నౌకా దళ ప్రధాన స్థావరాన్ని సందర్శించారు. తూర్పు నౌకా దళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ ఏకే జైన్, ఇతర అధికారులు వెంకయ్యకు సాదర స్వాగతం పలికారు. సిబ్బంది గౌరవ వందనం చేశారు.
తూర్పునౌకాదళ స్థావరాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య