విశాఖపట్నంలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సి.ఐ.ఎఫ్.టి) సంస్థలను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సందర్శించారు. ప్రదర్శనశాలలను తిలకించిన ఆయన... మత్స్యరంగంలో వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఈ సంస్థలు అభివృద్ది చేసిన స్నాపర్ సీడ్స్ ను దేశానికి అంకితం చేశారు.
అవగాహన కల్పించాలి....
శాస్త్రవేత్తలు, సిబ్బందితో ఉపరాష్ట్రపతి పలు అంశాలను పంచుకున్నారు. చేపల్లో ప్రొటిన్లు పుష్కలంగా ఉన్నాయని, దేశంలో భారతదేశ వార్షిక ఉత్పత్తి - డిమాండ్ - సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించే దిశగా కృషి జరగాలని ఆయన కోరారు. న్యూట్రాస్యూటికల్స్’, ‘ఆర్నమెంటల్ ఫిష్’ వంటి వినూత్న ఉత్పత్తుల ద్వారా భారతీయ సముద్ర జీవ సంస్కృతి వైవిధ్యం పెరగాలన్నారు. చేపల్లో ఒమేగా త్రీ ప్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని, గుండె ఆరోగ్యానికి చేకూర్చే మేలుపై సామాన్యులకూ అవగాహన కల్పించాలని వైద్యులు, ఆహార నిపుణులను కోరారు.