ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉక్కు నగరంలో విడిది చేశారు. నగరంలోని బీచ్ రోడ్ లో ఉన్న శ్రీపాండురంగ స్వామి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయన వెంట మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు కూడా ఉన్నారు. అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఉపరాష్ట్రపతి, మిజోరాం గవర్నర్ లకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.
Vice President : విశాఖలో పాండురంగ ఆలయాన్ని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి - Visakha beach road
విశాఖలో విడిది చేసిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బీచ్ రోడ్ లోని శ్రీపాండురంగ స్వామి అలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆయన వెంట మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు కూడా ఉన్నారు.
విశాఖలో పాండురంగని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి
స్వామి దర్శనానంతరం తీర్ధ ప్రసాదాలు అందించారు. బీచ్ రోడ్ లోని పాండురంగ స్వామి ఆలయం తనకు చిరపరిచితమని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. నరక చతుర్ధశి, దీపావళి పండుగల సందర్భంగా అలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.
ఇదీ చదవండి : Ganja: గంజాయి సాగుకు చెక్ పెట్టండి.. ఆ పంటల సాగుతో మంచి ఆదాయం: డీఐజీ