విశాఖలో లాక్ డౌన్ ఆంక్షలు పక్కాగా అమలవుతున్నాయి. విశాఖ నగర, నర్సీపట్నం, పద్మనాభం మండలాలు కంటైన్మెంట్ జోన్లుగా కొనసాగుతున్నాయి. ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీస్ పహారా కొనసాగుతుంది. లాక్డౌన్ ఉల్లఘించి బయటకు వస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు మూడున్నర వేల మందిపై కేసులు నమోదు చేశారు. రెండు వేల వాహనాలు సీజ్ చేశారు. ప్రధాన కూడలి వద్ద వాహన దారులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ నేతృత్వంలో 21 కమిటీలు కరోనా వ్యాప్తి నివారణకు పనిచేస్తున్నాయి.
విశాఖలో పక్కాగా లాక్‌డౌక్ ఆంక్షలు - విశాఖలో కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 35 కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 757కు చేరింది. విశాఖలో లాక్ డౌన్ ఆంక్షలు పక్కాగా అమలవుతున్నాయి. ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీస్ పహారా కొనసాగుతుంది.
viazag-corona-cases