ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రావణ మాసం సెంటిమెంట్...మళ్లీ మెుదలైన వాహన రిజిస్ట్రేషన్లు

కరోనా లాక్ డౌన్ ప్రభావం.. విశాఖ ప్రాంతీయ రవాణా శాఖపై పడింది. ఆదాయం దారుణంగా పడి పోయింది. అయితే.. అన్ లాక్ ప్రక్రియ మొదలు పెట్టాకా.. శ్రావణ మాసం సెంటిమెంట్ మొదలు కావడంతో తిరిగి వాహన కొనుగోళ్లు మొదలైయ్యాయి. తిరిగి మళ్లీ కాస్త ఆదాయాన్ని రవాణా శాఖ చూస్తోంది. ఇలాంటి సమయంలో ఆన్​లైన్​ సేవలను వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు.

vehicle registrarions in online
vehicle registrarions in online

By

Published : Aug 8, 2020, 6:28 PM IST

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంలో రవాణా శాఖ ప్రధాన వనరు. అయితే కరోనా వల్ల మార్చి నెల నుంచి జూన్ వరకు ఎలాంటి ఆదాయం లేదు. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన తరవాత జూన్ ఆఖరు వారం నుంచి కాస్త రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. లాక్​డౌన్​ సమయంలో ద్విచక్ర వాహనాలు. కార్ల కొనుగోలు తగ్గడం వల్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. తాజాగా శ్రావణ మాసం సెంటిమెంటుతో మళ్లి కొనుగోళ్లు మెుదలై.. వాహన రిజిస్ట్రేషన్లతో కాస్త ఆదాయం పుంజుకుంది.

కరోనా మహమ్మారితో ప్రమాదం ఉన్నందున.. రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లే పనిలేకుండా.. అంతా ఆన్​లైన్​లో చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే.. కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆన్​లైన్​ సేవలో పూర్తిగా సురక్షిత మార్గాలు ఉన్నాయని.. ఫోన్ ఓటీపీతో సేవలు పొందే వీలుందని.. రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి:పెళ్లికి ముందు రానాకు అక్షయ్ ఏం చెప్పాడంటే..!

ABOUT THE AUTHOR

...view details