14 నెలలుగా మనసు చంపుకొని తెలుగుదేశం పార్టీ తరపున కార్యక్రమాలు చేపట్టామని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పేర్కొన్నారు. సీఎం జగన్ చేస్తున్న పనులను చూసి వైకాపాకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. పేదవాడిని ఆదుకునేది వైకాపా ప్రభుత్వమేనని వివరించారు. 14 నెలల్లో అత్యధిక సొమ్మును సంక్షేమ పథకాల కోసం ఖర్చుపెట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని కొనియాడారు. ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించాలని, ఆ బాధ్యత తెలుగుదేశంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి పని లేకుండా వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోందని చెప్పారు. గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో ఏ బాధ్యత ఇచ్చినా పని చేస్తానని స్పష్టం చేశారు.
'సీఎం జగన్ ప్రతిపక్షాలకు పని లేకుండా చేశారు' - visakha latest news
ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాలకు పని లేకుండా పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనయ్యే వైకాపాకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో 14 నెలలుగా మనసు చంపుకొని ఉన్నానని పేర్కొన్నారు.

వాసుపల్లి గణేష్